రాజా..!
నీ కూత ఇదంటూ చెప్పావు...
108 నీ నంబరని చెప్పావు...
పిలిచిన వెంటనే వెళ్ళాలని చెప్పావు...
నమ్మిన వారిని కాపాడమని చెప్పావు...
రోగం అంటే భయం లేదు నువ్వున్నావని ధైర్యం చెప్పావు...
పల్లె పల్లెలో పని చుపించావు...
గల్లీ గల్లీలో సేవలన్దిన్చమన్నావు...
కుయ్ కుయ్ కుయ్ కుయ్ అంటు నా బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తు చేసావు...
అన్ని చెప్పావు... ఎన్నో చెప్పావు... ఇంకెన్నో చెప్పించావు...
కాని నిన్ను కూడా... నేనే... అదీ... ఇలా... మోయాలని ఎందుకు చెప్పలేదు...
ఇది చెప్పుంటే నిన్ను వేల్లనిచేవాళ్ళం కాదనా?..
108 నీ నంబర్ కూడా అని చెప్పలేదయ్య... సరిగ్గా సింహాసనం పై కూర్చొని 108 రోజులు గడచిన సమయానికి నా ఒడిలో వాలిపోయావ... ఇది నా అదృష్టమా?.. దౌర్భాగ్యమా?
కుయ్ కుయ్ కుయ్ అంటు అరవాలని చెప్పావు...
కాని...
ఏడవడం ఎలాగో ఎందుకు చెప్పలేదు రాజా?
నిన్ను తెచ్చినప్పుడు నా రోదన ఎలా వినిపించాలో అర్ధం కాలేదు...
అప్పుడూ కుయ్ కుయ్ కుయ్ అనే ఏడ్చాను...
రూపం కోల్పోయిన నీ అణువణువు పరీక్షిస్తున్నప్పుడు సాక్ష్యంగా చూస్తూ కుయ్ కుయ్ కుయ్ అనే కన్నీరు పెట్టాను...
నిన్ను కడపటి చూపులకు పెట్టినప్పుడు కూడా నా గుండె కుయ్ కుయ్ కుయ్ అనే విలపించింది...
నిన్ను పంచ భూతాల్లో ఐక్యం చేసినప్పుడూ నా అరుపు అదే...
ఇక నీ జ్ఞాపకం గా రాష్ట్ర వీధుల్లో విధుల్లో నీ పేరును మార్మోగేలా చేసేది ఇదే అరుపు...
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా చేసేది ఇదే అరుపు...
YSR అమర్ రహే అనే నినాదానికి చిహ్నం ఇదే అరుపు...
నా కూతే నీ స్మృతి... నా అరుపే నీ పిలుపు... నా రూపమే నీ చిహ్నం...
కుయ్ కుయ్ కుయ్ కుయ్ కుయ్ కుయ్
Monday, September 14, 2009
Subscribe to:
Post Comments (Atom)
ekkadunna. YSR maatram adi aravakundaa undaalane korukuntaaru ....
ReplyDelete--- andaroo aarogyangaa undali ani- aroju raavaali ani ...
Sarve janaa sukhino bhavantu