కరెక్టే, కొవ్వొత్తులు పట్టుకున్న పెద్ద మనుషులందిరిని నేను గౌరవిస్తాను అదే సమయంలో ఆక్షేపిస్తాను
ఎందుకంటే, ఇదే సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో బ్యాక్ డోర్ ఉద్యోగాల కధేంటి... కొవ్వొత్తులు పట్టుకుని తిరిగిన మనుషుల్లారా మీకే ఈ ప్రశ్న
మీలో ఎంతమంది ఫేక్ అనుభవం ధ్రువపత్రాలు వాడారో మీకే తెలియాలి... మరి అది అవినీతి కాదా....
నా ఫ్రెండ్ ఒకామె ఒక పేరు మోసిన సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తోంది... నిజం చెప్పాలంటే నటిస్తోంది... తను ఆ ఉద్యోగాన్ని ఫేక్ తోనే సంపాదించింది...
ఆ తర్వాత ఒక రోజు ఫోన్ చేసి మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటె చెప్పు మా కంపెనీ లో వెనక తలుపులు తెరిచే ఉన్నాయంది...
లక్షన్నర ఇస్తే నెలకు ఇరవై వేల ఉద్యోగం...
నా మరో మిత్రుడు ఇప్పుడు ఫేక్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు
విచిత్రం ఏమిటంటే వీళ్ళిద్దరూ కొవ్వొత్తులు పట్టుకున్నారు
ఇలా కొవ్వొత్తులు పట్టుకుని, సగం దినం ఉపవాసాలు చేసిన ఎంతో మందిలో చాలా మంది ఫేక్ గాళ్ళు ఉన్నారు
ఇక డాక్టర్లు - రోజు ఫీజు చేతులతో తీసుకునే వీరు బిల్లిస్తారా? టాక్సు కడతారా?
మరి లాయెర్లు...
ఇక మరో విషయం కూడా తెలిసింది - అది నిజమో కాదో తెలియదు కాని - వింటే కళ్ళు తిరిగాయి..
ఒక వ్యక్తీ గ్రూప్ వన్ రాసి, ఇంటర్వ్యూలో మేనేజ్ చేసుకుని, మంత్రికి మనీ ఇచ్చి, ఎమ్మెల్యేకి తోడుగా ఉంటానని మాటిచ్చి, సొంతూరు లో సబ్ కలెక్టర్ ఉద్యోగం తెచుకున్నారట... ఇందుకైన ఖర్చు అక్షరాల ఇరవై లక్షలు... ఇప్పుడు అవి రాబట్టుకునే పనిలో సఫలీక్రుతులవుతున్నారట... వారు కూడా కొవ్వొత్తి పట్టి నినదిన్చారట... గ్రేట్ కదా...
ఇక మీడియా - యాడ్ ఇస్తే ముద్దు, ఇవ్వకపోతే వార్త గుద్దు... ఆ కాలేజి ఇలా జరిగింది, ఈ ప్రోడుక్టు నాసిరకం అని రాసి, కూసి, తీరా యాడు రాగానే అన్ని మూసుకునే మన మెరుగైన సమాజపు మీడియా కూడా కొవ్వొత్తుల ర్యాలిలు చేస్తే, దేనితో నవ్వాలో అర్ధం కావడం లేదు
వీళ్ళంతా ఇలా అరిచేసి ఎం చేపుదామనుకున్ట్టున్నారో నాకు... ఊహు...
అవినీతి రాజకీయ నాయకులు ఎక్కడో లేరు మనలోనే ఉన్నారనేది ఈ ఉదాహరణలతో అర్ధమౌతుంది
ఒక పార్టీ దగ్గర వెయ్య, ఇంకో పార్టీ దగ్గర రెండు వేలు, మరో పార్టీ దగ్గర రెండు వేల అయిదు వందలు తీసుకుని చివరికి ఎవరికీ వోట్ వెయ్యకుండా ఇంట్లో టీవి చూస్తూ కూర్చున్న బంధుగణం నాకుంది...
అందుకే నేను ఒకటి ఫాలో అవటానికి ప్రయత్నిస్తున్నా... నేను లంచం తీసుకోను, ఎవడికి ఇవ్వను... ఎవడికి ఇవ్వను అంటున్నాడు ఎవర్తైన అడిగితే ఇచ్చేస్తాడా అని డౌట్ పడకండి... ఇవ్వను...
నాకు సరిగ్గా పద్దెనిమిది వయసులో డ్రైవింగ్ లైసెన్సు కోసం ఒక బ్రోకర్ ఇన్స్పెక్టర్, సారి, బ్రేక్ ఇన్స్పెక్టర్ కి వంద ఇచ్చా...
సరిగ్గా నాలుగేళ్ల తర్వాత, ఆ లైసెన్సు వాడాలంటే చిరాకనిపించి, పక్కన పడేసి, ఈసారి లంచం ఇవ్వకుండా టు కం ఫోర్ వీలర్ లైసెన్సు తీసుకున్నా...
ఇక లంచం అవసరం లేకుండానే నా ప్రతిభను గుర్తించి ఒక పెద్దాయన ఈ ఉద్యోగం ఇచ్చారు... ఇందులో లంచం తీసుకునే ముచ్చటే లేదాయే...
ఉంటే తీసుకునేవాడివన్నమాట అని సందేహపడకండి... తీసుకోను...
కాబట్టి పెద్దలారా - ముందు మనం మారదాం - తర్వాత దేశం గురించి అరుద్దాం
ఇది కుదురుతుందా అని డౌట్ పడకండి...
ట్రై చేసి చూడమ్మా...!
No comments:
Post a Comment